నిజామాబాద్ లో కాంగ్రెస్ బిసి గర్జన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది అని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాం అని తెలిపారు.
Read Also: Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వెనుజబడిన వర్గాల వారిని చదువుకు దూరం చేస్తున్నాడు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు చదువుకుంటే రాజ్యాధిజరం అడుగుతారని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. బీసీలు ఎవరికి వ్యతిరేఖం కాదు, కేవలం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అందరి పార్టీ, బీఆర్ఎస్ దొరల పార్టీ.. గద్దర్ కోరుకున్న సామాజిక న్యాయం రావాలంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని మధుయాష్కీ అన్నారు.
Read Also: Perni Nani: బాబు విజన్ 2020 ఏమైంది..? మళ్లీ విజన్ 2047 ఏంటి..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పందికొక్కులు వలే దోచుకుంటున్నారు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి ఆరోపించారు. ఎంపీ కాక ముందు కవితకు సొంత ఇలు కూడా లేదు.. అలాంటిది ఇప్పుడు లక్షల కోట్లు ఎలా వచ్చాయి.. బీసీ గర్జన ద్వారా సత్తా చాటబోతున్నాం.. 2 వారాల్లో బీసీ సీట్లు కొలిక్కి వస్తాయి.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థును ప్రకటిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు.