నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికి ఓటు వేసినా మాకే పడుతుంది.. బీజేపీనే గెలుస్తుంది అని సంచలన కామెంట్స్ చేశారు. ఇక, ఆవాస్ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాము.. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇండ్లు నిర్మించాం.. మరో 50 లక్షలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పేదలకు గృహ నిర్మాణాల్లో తెలంగాణ సర్కారు చాలా వెనుకబడింది.. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్.. ఆశ చూపి వారిని మభ్యపెడుతున్నారని అర్వింద్ అన్నారు.
Read Also: Delhi Police: G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలి
ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు అందకుండా చేస్తున్నారు అని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో ముస్లీంలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు.. కేవలం ముగ్గురు ముస్లీంలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యనించారు. 14 శాతం ఓటర్లున్న ముస్లీంలకు ముస్లీం బంధు ఎందుకు ఇవ్వరు అని ధర్మపురి అర్వింద్ అడిగారు. దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు.. ముస్లీంలకు ఒక లక్ష నా ఇచ్చేది.. బీజేపీకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయండి.. మోడీ పాలనలో ముస్లీం మైనారిటీలకు భద్రత పెరిగింది అని ఎంపీ అర్వింద్ తెలిపారు.
Read Also: Manchu Vishnu: టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి పని చేయనున్న టాలీవుడ్
బీజేపీకి ముస్లీంల ఓట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీతో ముస్లిం మైనారిటీలకే నష్టం.. బుడబుక్కలతో కేటీఆర్ ను పొరపాటున సంభోదించిన.. బుడబుక్కల సమాజానికి క్షమాపణ కోరుతున్నాను అని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు.