Nimisha Priya Case: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటుున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికల్ని భారత్ తిరస్కరించింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది.
యెమెన్‌లో ఉరిశిక్ష పడిన భారత సంతతి నిర్సు నిమిషా ప్రియకు ప్రస్తుతం ఊరట లభించింది. నిమిషా ప్రియకు ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.
యెమెన్‌లో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై కేంద్రం చేతులెత్తేసింది. ఉరిశిక్షను నిలిపివేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. దౌత్యపరంగా చేపట్టాల్సిన అన్ని అయిపోయాయని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది.
Execution: యెమెన్ దేశంలో కేరళ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ఈ శిక్ష నుంచి ఆమెను తప్పించేందుకు, షరియా చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘‘బ్లడ్ మనీ’’ కింద పరిహారం ఇచ్చేందుకు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 14న భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. యెమెన్ దేశస్తుడి నుంచి తన పాస్‌పోర్టు తీసుకునేందుకు, నిమిషా ప్రియా మత్తు మందు ఇచ్చింది. ఇది వికటించి అతను మరణించడంతో,…
Nimisha Priya: యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
Nimisha Priya case: హత్య ఆరోపణలపై యెమెన్ దేశంలో మరణశిక్ష విధించబడిన భారతీయ మహిళ నిమిషా ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ‘‘ మానవతా కారణాల’’ దృష్ట్యా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉణ్నట్లు ఇరాన్ సీనియర్ అధికారి గురువారం తెలిపారు.