యెమెన్‌లో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై కేంద్రం చేతులెత్తేసింది. ఉరిశిక్షను నిలిపివేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. దౌత్యపరంగా చేపట్టాల్సిన అన్ని అయిపోయాయని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఇక తమ చేతుల్లో ఏమీలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉరిశిక్ష నిలిపివేతపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానానికి సోమవారం కేంద్రం ఈ విధంగా తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Yamaha FZ-X Hybrid: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?.. యమహా FZ-X హైబ్రిడ్ విడుదల.. ఈ బైక్ పై ఓ లుక్కేయండి
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Rajni : సూపర్ హిట్ దర్శకుడితో సూపర్ స్టార్
అయితే ప్రస్తుతం యెమెన్ దేశం హౌతీల నియంత్రణలో ఉంది. దీంతో దౌత్యపరంగా భారత్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆమె విడుదల కోసం కేంద్రం చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించలేదు. నర్సు విడుదల కోసం కేంద్రం చేపట్టాల్సిన చివరి ప్రయత్నాన్ని కూడా చేపట్టినా ప్రయోజనం లేదని కోర్టుకు కేంద్రం తరపున అటార్నీ జనరల్ తెలిపారు.
నిమిషా ప్రియ.. 2008 నుంచి యెమెన్‌లో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్‌తో కలిసి యెమెన్ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తెతో కేరళకు తిరిగి వచ్చేశాడు. నిమిషా మాత్రం యెమెన్‌లోనే ఉండిపోయింది. అనంతరం ఆమె యెమెన్ జాతీయుడితో కలిసి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అయితే ఆమెపై మెహదీ అఘాయిత్యం చేయబోయాడు. అనేక మార్లు శారీరికంగా వేధించాడు. అంతేకాకుండా పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే పాస్‌పోర్టును తిరిగి పొందే క్రమంలో మత్తు మందులు ఇచ్చానని.. కానీ అతడు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో ఉంది. మంగళవారం ఉరిశిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఉరిశిక్షను ఆపాలంటూ ప్రధాని మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 6, మార్చి 24, 2025న లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖలు పంపి విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కూడా కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్రం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.