Terror threat: జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా జైళ్ల దగ్గర భద్రతాను భారీగా పెంచేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు సూచించాయి.
India-Pakistan: జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ తన ప్రాథమిక నివేదికను ఈ రోజు ( మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. డైరెక్టర్ జనరల్ సదానంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నివేదిక రూపొందించారు.
పహల్గామ్‌లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగా భావిస్తోంది.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు రీల్స్ చేస్తున్న సమయంలో కొందరి మొబైల్‌లో ముష్కరుల దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తాజాగా, జిప్ లైనర్‌పై వెళ్తున్న ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా టెర్రరిస్టుల దాడి రికార్డ్ అయింది. అయితే, దీనికి ముందు జిప్ లైన్ ఆపరేటర్ చేసిన ‘‘ అల్లాహు అక్బర్’’ నినాదాలు సంచలనంగా మారాయి. ఆపరేటర్ ముజమ్మిల్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాదుల కీలక సూత్రధారుల్లో ఒకరైన పాక్-కెనెడియన్ తహవూర్ రాణా విచారణ ప్రారంభమైంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి రోజు విచారణకు రాణా పెద్దగా సహకరించలేదని, పరిమిత సమాచారాన్ని అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు తీసుకువచ్చిన తర్వాత గురువారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రాణాను 18 రోజుల NIA కస్టడీకి అప్పగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ రాణాను NIA కస్టడీలోకి తీసుకుంది. ఈ కస్టడీలో భాగంగా 26/11 ఉగ్రవాద దాడి వెనుక ఉన్న మొత్తం కుట్రను వెలికితీసేందుకు అతన్ని వివరంగా ప్రశ్నించనున్నారు. అమెరికా నుంచి భారత్ కు తరలించిన…
TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్‌కి అప్పగించింది.
Human Trafficking In Bangladeshi Girls: బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది.