బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల తొలి టార్గెట్ బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పేల్చడమేనని వెల్లడించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం రోజే బీజేపీ కార్యాలయాన్ని ఐఈడీతో పేల్చేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిపింది.
Cooker blast:బెంగళూర్ నగరంలో కుక్కర్ పేలుడు ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని స్థానిక పోలీసులు తోసిపుచ్చగా, మరోసారి విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సంఘటన స్థలానికి చేరుకుంది.
దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్‌ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసింది.
Delhi : దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్‌ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసింది.
NIA Raids : బీహార్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో నిషేధిత నక్సలైట్ సంస్థ సీపీఐ మావోయిస్టు ప్రత్యేక ఏరియా కమిటీ సభ్యుడు ఉదయ్ జీ అలియాస్ రాజేష్ కుమార్ సిన్హాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.
Reasi bus attack: రియాసిలో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
పంజాబ్‌లో, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, అతడి సహచరులకు సంబంధించిన 9 ప్రదేశాలపై దాడులు చేసింది. దోపిడీ, కాల్పుల కేసుకు సంబంధించిన కేసులో రైడ్ నిర్వహించిన ఎన్ఐఏ డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.
మణిపూర్ రాష్ట్రంలో హింసకు మయన్మార్ లో ప్లానింగ్ జరిగినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. గతేడాది మణిపూర్ లో రెండు జాతుల మధ్య గొడవలో పాల్గొనేందుకు యువకులకు తుపాకులతో శిక్షణ ఇచ్చారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది.
ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు.