బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.
ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టులో కేన్ విలియమ్సన్ గజ్జల్లో గాయం అయింది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కోసం న్యూజిలాండ్‌లో పునరావాసం పొందుతున్నాడు. భారత్‌తో రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉంటాడనుకున్నా.. 100 శాతం ఫిట్‌గా లేడు. విలియమ్సన్ పురోగతి సాధిస్తున్నప్పటికీ.. అతను టెస్టు క్రికెట్ ఆడే ఫిట్‌నెస్ సాధించలేదని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. విలియమ్సన్ చివరి టెస్టులో ఆడడం కూడా అనుమానంగానే ఉంది.
Also Read: IND vs NZ 2nd Test: రిషబ్ పంత్ ఆడితే.. కేఎల్ రాహుల్ తప్పుకోవాల్సిందే!
కేన్ విలియమ్సన్ స్థానంలో మొదటి టెస్ట్ కోసం మార్క్ చాప్‌మన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రెండో టెస్టుకు సైతం అతడే కొనసాగనున్నాడు. ఏదేమైనా కేన్ మామ దూరమవడం మన బౌలర్లకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే కేన్ మంచి ఫామ్ మీదున్నాడు. కేన్ లేకున్నా కాన్వే, రచిన్, డారిల్, బండెల్, లాతమ్‌లు రాణిస్తున్నారు. పూణేలో గురువారం (అక్టోబర్ 24) నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది.