న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్ రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హ్యాలీడే కొట్టిన షాట్‌ను వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టింది. ఇటు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అదరగొట్టింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది.
శనివారం క్రికెట్ ప్రపంచంలో రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది పాకిస్తాన్. మరోవైపు.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి కైవసం చేసుకుంది.
టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది.
పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది.
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1 పరుగులతో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6*), శుభ్‌మన్ గిల్ (10*) ఉన్నారు. కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.…