Hug Time: న్యూజిలాండ్‌లోని డునెడిన్ విమానాశ్రయంలో డ్రాప్-ఆఫ్ జోన్‌లో వీడ్కోలు కౌగిలింతలపై సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇది తుది ఆలింగనానికి కేవలం మూడు నిమిషాల సమయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. విమానాశ్రయం వద్ద ఒక సైన్‌బోర్డులో “గరిష్టంగా కౌగిలించుకునే సమయం 3 నిమిషాలు అని, ఇష్టపడే వీడ్కోలు కోసం దయచేసి కార్ పార్క్‌ని ఉపయోగించండి” అని సూచిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు దారి తీస్తోంది.
Read Also: Khalistani Terrorist: నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు వార్నింగ్
అసలు కౌగిలింతకు టైమ్ లిమిట్ ఏమంటూ పెద్దెత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఈ కొత్త నిబంధనను మెచ్చుకుంటున్నారు కూడా. అంతే కాదండోయ్.. ఇతర విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి నిబంధలనే తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా.. డ్రాప్ అఫ్ ఏరియా ఇంకా ఉచితమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే, ఈ సైన్ బోర్డు ఏర్పాటు విషయమై డ్యునెడిన్ విమానాశ్రయ సీఈవో డేనియల్ డి బోనో మాట్లాడుతూ.. విమానాశ్రయాలు ‘ఎమోషనల్ హాట్‌స్పాట్లు’ అని తెలుపుతూనే.. మరోవైపు 20 సెకన్ల కౌగిలింతకే అవసరమైంత ‘లవ్ హార్మోన్’ ఆక్సిటోసిన్ విడుదలవుతుందని సైన్స్ విషయాన్నీ చెప్పుకొచ్చారు. ఇలా తక్కువ సమయం కౌగిలింతల వల్ల ఎక్కువమందికి అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇలాంటి వింత చర్యలు ముందుముందు ఎన్ని చూడాలో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Read Also: CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్