న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్‌తో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.
Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..
నిజానికి వర్షం కారణంగా మ్యాచ్ తొలిరోజు ఒక్క బంతి కూడా పడలేదు. కాగా.. రెండో రోజు రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది. ‘ఈ మ్యాచ్‌లో మేం సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ఫలితాన్ని రాబట్టాం. తొలి రెండు ఇన్నింగ్స్‌లే మా విజయాన్ని ఖరారు చేశాయి. మూడో ఇన్నింగ్స్‌లో భారత్ కమ్ బ్యాక్ చేస్తుందని మాకు తెలుసు. కానీ రెండో కొత్త బంతితో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. సొంత గడ్డపై భారత జట్టు ఎంత క్వాలిటీ జట్టో మాకు తెలుసు. కొత్త బంతి మమ్మల్ని ఎలా దెబ్బతీసిందో భారత్‌ను కూడా అలా దెబ్బకొడుతుందని మేం అంచనా వేసాం. ‘ ముఖ్యంగా ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించిన రచిన్ రవీంద్ర (134), టిమ్ సౌథీ (65)లను లాథమ్ ప్రశంసించాడు. వారి భాగస్వామ్యం మా విజయానికి బాటలు వేసింది. 100 పరుగుల లక్ష్యమే ఉండటం కూడా మేం స్వేచ్చగా ఆడేలా చేసింది.’ అని లాథమ్ తెలిపాడు.
Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు..
విలియమ్ ఓ రూర్కీ అద్భుతంగా రాణించాడు. అతనికి పేస్, బౌన్స్, గాలిలో, వికెట్ వెలుపల బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అనుభవజ్ఞులైన సౌథీ, మాట్ హెన్రీ అతనికి సపోర్ట్ చేశారు. సౌదీ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. సౌథీకి బ్యాటింగ్ సామర్థ్యం గురించి మాకు బాగా తెలుసు. కొన్నేళ్ల క్రితమే రచిన్ టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రచిన్ 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్లేయర్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడని లాథమ్ చెప్పుకొచ్చాడు. కాగా.. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి పుణెలో జరగనుంది.