పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మరో 3 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు మొత్తం వికెట్లు తీయడం గమనార్హం.
Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లలో డేవాన్ కాన్వే అత్యధికంగా (76) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. రచిన్ రవీంద్ర (65), మిచెల్ సాంథ్నర్ (33) పరగులు సాధించారు. మిగత బ్యాటర్లలో అందరూ 20 పరుగులకు మించి రన్స్ చేయలేదు. కివీస్ బ్యాటర్లకు వాషింగ్టన్ సుందర్ అడ్డుగోడలా నిలబడి వికెట్లు తీయడంతో పాటు.. పరుగులను కూడా కట్టడి చేశాడు. దీంతో.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే తొలి దెబ్బ తాకింది. ఒక పరుగు వద్ద రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు.
Read Also: Damodara Rajanarsimha: ప్రజలకు వైద్యం, విద్య, సంక్షేమం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..