Earthquake: జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. గత 10 రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. జనవరి 1న 3.8 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో కశ్మీర్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ నెల 5న అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూమిలో కదలికలు వచ్చాయి. దీంతో జమ్ముకశ్మీర్‌తోపాటు, ఢిల్లీలో కూడా భూకంపం వచ్చింది.
Read Also: Bus Crash Kills 40 : సెనెగల్‌లో ఘోర ప్రమాదం.. 40మంది ప్రయాణికుల మృతి
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ఆదివారం పసిఫిక్ మహాసముద్రంలోనూ భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ ద్వీపదేశం వనౌటు తీరానికి సమీపంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. పోర్ట్ ఓల్రీ అనే గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో 27 కిమీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భారీ ప్రకంపనలతో వనౌటుతో పాటు, న్యూకలెడోనియా, సాల్మన్ ఐలాండ్స్ కు కూడా సునామీ హెచ్చరిక జారీ అయింది. దాంతో ప్రజలు సమీపంలోని ఎత్తయిన ప్రదేశాలకు పరుగులు తీశారు. అయితే, కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ తీర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని వనౌటులోని ఫ్రెంచ్ దౌత్యకార్యాలయం సూచించింది.
Earthquake of Magnitude:3.6, Occurred on 08-01-2023, 23:12:30 IST, Lat: 33.54 & Long: 76.24, Depth: 10 Km ,Location: Kishtwar, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/kJzYMByNkr@Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/9Kv74TmUXe
— National Center for Seismology (@NCS_Earthquake) January 8, 2023
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!