Panipuri : పానీపూరీ గురించి వినగానే ఎవరి నోళ్లలోనైనా నీళ్లొస్తాయి. చాలా మంది పానీపూరీ చూడగానే టెంప్టేషన్‌ను తట్టుకోలేరు. అయితే పానీపూరీ తినడానికి నిరాకరించడంతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోని షాహదారా జిల్లాలో చోటుచేసుకుంది. పొరుగు మహిళ ఇచ్చిన పానీపూరీ తినేందుకు వృద్ధురాలు నిరాకరించింది. అదే విషయంలో పానీపూరీ ఆఫర్ చేసిన మహిళకు కోపం వచ్చింది. దీంతో ఆ వృద్ధురాలిని మహిళ, ఆమె తల్లి, ఇద్దరు కోడళ్లు కొట్టడం ప్రారంభించారు. నలుగురూ అతి కిరాతకంగా కొట్టడం, నెట్టడంతో వృద్ధురాలు తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వృద్ధురాలు కాసేపటికే చనిపోయింది. ఈ ఘటన జీటీబీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
Read Also: Bandi sanjay: ‘బండి’ అత్తగారింట్లో ‘బలగం’ సీన్ రిపీట్
వివరాల ప్రకారం.. శకుంతలా దేవి కుటుంబం ఖేడా గ్రామంలోని జిటిబి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తోంది. ఆమె తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఇంతలో ఇంటి దగ్గర శీతల్ అనే మహిళ నడుచుకుంటూ వస్తోంది. శకుంతలకు పానీపూరీ ఇచ్చింది. కానీ శకుంతల పానీపూరీ తీసుకోవడానికి నిరాకరించింది. శకుంతల దేవి తన మాటను తిరస్కరించి తనను అవమానించిందని భావించిన శీతల్ ఆమెతో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం విన్న శీతల్ తల్లి, ఇద్దరు కోడళ్లు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో వారంతా శీతల్ పక్షం వహించి శకుంతలా దేవిని కొట్టడం ప్రారంభించారు. శకుంతల కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.
Read Also: Kiran Kumar Reddy Joins Bjp Live: బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి
శకుంతలా దేవి మృతి తర్వాత కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా శకుంతలా దేవిని కొట్టిన నలుగురు మహిళలపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం, మొత్తం నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. శకుంతలి దేవిని కొట్టిన ఇరుగుపొరుగు మహిళ శీతల్ ప్రధాన నిందితురాలని, ఆమెతో పాటు మరో ముగ్గురిపై హత్యానేరం కేసు పెట్టాలని శకుంతలా దేవి కుటుంబం డిమాండ్ చేసింది.