భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పరారీలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను పట్టుకున్నారు. మెక్సికోలో పోలీసు అధికారులకు పట్టుబడిన దీపక్ బాక్సర్‌ను బుధవారం న్యూఢిల్లీకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌బిఐ, మెక్సికో పోలీసులు, సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది. దేశం వెలుపల ఆపరేషన్‌లో గ్యాంగ్‌స్టర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లోని ఇద్దరు సభ్యుల బృందం బుధవారం ఉదయం 6 గంటలకు మెక్సికో నుంచి ఇస్తాంబుల్ మీదుగా ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Also Read:Andhrapradesh IT Exports: ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా ఎంతో తెలుసా?
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గోగీ గ్యాంగ్‌కు నాయకత్వం వహించాడు దీపక్. హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని గన్నౌర్‌కు చెందిన ఈ గ్యాంగ్‌స్టర్..గత ఐదేళ్లుగా హత్యలు, దోపిడీలు సహా 10 సంచలనాత్మక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ దీపక్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. ఉత్తర ఢిల్లీలో ఒక బిల్డర్‌ను హత్య చేయడంలో దీపక్ ప్రమేయం ఉందని పోలీసులు చెప్పారు. జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన గ్యాంగ్‌స్టర్ దీపక్ అనంతరం పలు నేరాలకు పాల్పడ్డాడు. రోహిణి కోర్టులో జితేంద్ర గోగిని హత్య చేసిన తర్వాత దీపక్ బాక్సర్ స్థానిక గోగి గ్యాంగ్‌ను నాయకత్వం వహిస్తున్నాడు. దీపక్ పై3 లక్షల రివార్డు కూడా ఉంది.