దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని వివరించాయి. ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Read Also: రైతుల సంక్షేమంలో దేశానికే కేసీఆర్ మార్గదర్శి
మరోవైపు ఈరోజు సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ఎంపీలు ధర్నాకు దిగారు.