కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్‌తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రామకృష్ణ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్న రమ్య అనే యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలిసింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన రమ్య వెంట తనను ప్రేమించాలని ఎంతో కాలంగా వేధిస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రిని కుమారుడు దారుణంగా హత మార్చిన ఘటన జరిగింది.. స్థానికంగా నివసించే పాలెపు వెంకటేశ్వర్లు... ఆయన కుమారుడైన శివాజీకి గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్‌లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది.
Nellore Crime: నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆకాష్ అనే యువకుడు తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆకాశ్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ.. మిత్రులు.. కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని బైఠాయించారు. ఒక కేసు విచారణ నిమిత్తం ఆకాష్ మీ పలుమార్లు స్టేషన్.కు పిలిచి ఎస్.ఐ. నాగబాబుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు వేధింపులకు గురి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీసులపై…