Nellore Crime: ఆస్తి కోసం కన్నవారు.. పెంచినవారు.. కట్టుకున్నోడు.. స్నేహితులు.. బంధువులు.. ఇలా తేడా లేకుండా ఘాతుకాలు జరుగుతున్నాయి.. ఆస్తుల ముందు మానవ సంబంధాలు సమాధిగా మారిపోతున్నాయి.. తాజాగా, నెల్లూరు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రిని కుమారుడు దారుణంగా హత మార్చిన ఘటన జరిగింది.. స్థానికంగా నివసించే పాలెపు వెంకటేశ్వర్లు… ఆయన కుమారుడైన శివాజీకి గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతోంది.
Read Also: Karnataka : ప్రేమించాననడం ఆపై రేప్ కేసు పెట్టడం.. పది మందిని ముంచిన కిలాడీ లేడీ
తాను చెప్పినట్లు ఆస్తులు పంపిణీ చేయాలని తండ్రి వెంకటేశ్వర్లుకు కుమారుడు సూచించినా.. ఆయన వినిపించుకోలేదు.. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఆస్తికి సంబంధించి తండ్రితో శివాజీ గొడవకు దిగాడు.. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.. ఆస్తి తనకు దక్కడం లేదనే ఆగ్రహంతో ఉన్న కొడుకు.. సహనం కోల్పోయాడు.. కోపంతో బండరాయితో వెంకటేశ్వర్లు తలపై బాదాడు.. ఇక, తలకు బలమైన గాయం తగలడంతో.. అక్కడికక్కడే మరణించాడు వెంకటేశ్వర్లు… ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.. దీంతో క్లూస్ టీమ్ తో పోలీసులు రంగంలోకి దిగారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆస్తి కోసం కుమారుడు.. కన్న తండ్రినే హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..