Married Woman: ఒక్కోసారి కొందరు ఆవేశంలో లేనిపోని నిర్ణయాలు తీసుకుంటుంటారు. సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకునే కోణంలో ఆలోచించరు. సమస్యలు తీవ్రమైనప్పుడు.. తీవ్ర ఆందోళనలో చంపడమో లేక చావడమో వంటి పనులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ వివాహిత కూడా అదే పని చేసింది. భర్తతో విడిపోయి, మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఆమె.. ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Viral Video: మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన తల్లి.. వీడియో వైరల్!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరుకు చెందిన శ్రీలేఖ (28) అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. దీంతో.. శ్రీలేఖ భర్తతో విడాకులు తీసుకొని, ఒంటరిగా నివసించసాగింది. ఈ క్రమంలోనే ఆమెకు దుర్గప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లు హ్యాపీగానే గడిపారు కానీ, క్రమంగా వీరి మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారు. బుధవారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.
Shamshabad: శంషాబాద్ హత్య కేసు మిస్టరీ వీడింది.. మృతి చెందిన మహిళ మంజుల..!
అప్పుడు దుర్గప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కాసేపయ్యాక ఇంటికి తిరిగిరాగా.. ఇంటి తలుపులు వేసి ఉండటాన్ని గమనించాడు. డోర్ తీయమని గట్టిగా కేకలు వేశాడు. కానీ.. లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, చుట్టుపక్కల వారి సహాయంతో దుర్గప్రసాద్ తలుపులు బద్దలుకొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. శ్రీలేఖ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం పోలీసులకు అందజేయగా.. వాళ్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, శ్రీలేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొదట భర్తతో విడాకులు, ఆ తర్వాత ప్రియుడితో మనస్పర్థలు ఏర్పడిన నేపథ్యంలో.. శ్రీలేఖ నిరాశకు గురై ఈ నిర్నయం తీసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.