CM Chandrababu: జల వనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే.. ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు 2024 సవరణ బిల్లుపై నివేదికను ‘జేపీసీ’ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) గురువారం రాజసభలో సమర్పించింది.
Mood of the Nation: మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN) పోల్‌లో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికి ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 343 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది.
Mood of the Nation poll: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి ఘన విజయం సాధిస్తుందని సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 33-35 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎన్డీయే ఓట్ల శాతం 47 నుంచి 52 శాతానికి పెరుగుతుందని అంచనా. బీహార్‌లో ఎన్డీయే తన పట్టును నిలుపుకుంటుందని చెప్పింది.
Minister Kollu Ravindra: ఏపీలో లిక్కర్ ధరల పెంపకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఎకైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 వేల షాపులకు 90 వేల దరఖాస్తులు వచ్చాయి.. చాలా పారదర్శకంగా మద్యం దుకాణాల అలాట్మెంట్ జరిగింది.. గతంలో పనికి రాని చెత్త బ్రాండ్లు ఉండేవి అన్నారు.
YV Subba Reddy: బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో రాష్టానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించాలని దృష్టి సారించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు.
Minister Kandula Durgesh: ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.
AP Liquor Rates Hike: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ సందర్భంగా, 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రులు అందరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు.