Minister Kollu Ravindra: ఏపీలో లిక్కర్ ధరల పెంపకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఎకైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 వేల షాపులకు 90 వేల దరఖాస్తులు వచ్చాయి.. చాలా పారదర్శకంగా మద్యం దుకాణాల అలాట్మెంట్ జరిగింది.. గతంలో పనికి రాని చెత్త బ్రాండ్లు ఉండేవి అన్నారు. మార్జిన్ పెంచడం వల్ల బాటిల్ పై పది రూపాయలు పెంచడం జరిగింది.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని ఆయన మండిపడ్డారు. కల్లు గీత కార్మికులకు 10 శాతం షాపులను కేటాయించాము.. కల్లు గీత కార్మికుల విషయంలో కోర్టుకు వెళ్లినా బలంగా వాదించాం.. ప్రజాలకు కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.. పెరిగిన ఛార్జీలు కేవలం 1 శాతం మాత్రమే అని మంత్రి రవీంద్ర అన్నారు.
Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
ఇక, జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో రూ.12 వేల కోట్లు చెల్లింపులు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మరో రూ.13 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది.. వైసీపీ హాయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారు.. మద్యంలో జగన్ సర్కార్ చేసిన తప్పుల్ని ఒక్కోక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం.. గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతోనూ రాష్ట్రంలో విక్రయాలు జరిపారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నాం.. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.. అన్ని రకాల తనిఖీలు చేశాకే మద్యం విక్రయాలు చేస్తున్నాం.. గతంలో వైసీపీ చేసిన పనులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. గతంలో సిండికేట్లను ఏర్పాటు చేసింది వైసీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టింది అని ఆరోపించారు. అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.