వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు…
CM Chandrababu: అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు జాగ్రత్త ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చెయ్యడం ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేస్తే తప్పించుకోలేరు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. సభలో 164 మంది సభ్యులు ఉండాలి.. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా.. అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా.. ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది.. ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది..
Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
ఇంట్లో రచ్చ... బయటా రచ్చే.... ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం.... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఇది.
జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు.. జనసేనలో చాలా మంది పదవులు కోసం ఆశిస్తున్నారు.. పదవులు కోసమే ప్రయాణం చేయకూడదు అని మంత్రి మనోహర్ సూచించారు.
Gudivada Amarnath: ఎన్నికల ముందు హలో ఏపీ.. బైబై వైసీపీ అని విస్తృత ప్రచారం చేసిన కూటమి పార్టీలు వంచన చూసిన తర్వాత హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరుతో పాటు గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
Minister Durgesh: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదంగా ఉంది అన్నారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు.