Minister Kandula Durgesh: ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్స్ సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే, సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయన్నారు. అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని వివరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు- లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. గండికోట ఫోర్టుకు సంబంధించిన టెండర్లు స్వీకరించామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు.
Read Also: Andhra Pradesh: ప్రతీ జిల్లా కేంద్రంలో బీసీ భవన్.. కలెక్టర్లకు ఆదేశాలు..
అలాగే, స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయదలచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను త్వరతితగతిన ఆమోదించమని కేంద్ర మంత్రిని అభ్యర్థించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్. ప్రసాద్ స్కీం క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి.. తొలి విడత మంజూరైన నిధులను వినియోగించాం.. 2, 3వ విడత నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. 19 సెప్టెంబర్, 2024న నెల్లూరులోని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి, మంగళగిరి, అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదలను ఆమోదించాలని కేంద్రమంత్రిని కోరిన మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చెప్పారు.