ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..
'జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ‘కూటమిలోని మూడు పార్టీల శ్రేణులూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున కూడా ఎవరైనా స్పందించినా, మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు. బహిరంగంగా చర్చించొద్దు అని సూచిస్తూ.. జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్.
Off The Record: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వృధాగా పోయే ఫ్లైయాష్.. రెండు పార్టీల మధ్య వైరానికి దారి తీసింది. ఆ రెండు కుటుంబాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవే. కాంట్రాక్ట్ పనుల విషయంలో ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఎంతవరకైనా వెళ్తాం.. తగ్గేదేలే అంటోంది జేసీ వర్గం. మా ప్రాంతంలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పొలిటికల్ హీట్ పెంచారు. సీఎం చంద్రబాబు హెచ్చరించినా ఇరువురు నేతలు తగ్గలేదు. చివరకు…
Sanjay Raut: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు..
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.
Nitish Kumar: 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతాయని ఎన్డీయే శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్ని తమ నాయకుడిగా ప్రకటించే అవకాశం లేదని వస్తున్న ఊహాగానాలపై ఈ రోజు స్పష్టత వచ్చింది. బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు సమావేశమయ్యారు.