గత యేడాది దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ‘దసరా’కు సంబంధించిన ప్రకటనతో పాటు ఓ గ్లింప్స్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని సరసన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న మాస్ ఎంటర్ టైనర్…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫర్హద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించి… ఆవకాయ సీజన్ లో తమ ఆగమనం ఎప్పుడైనా ఉండొచ్చని దర్శక నిర్మాతలు తెలిపారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ పిక్చరైజేషన్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్…
ప్రస్తుతం సినిమా తన పోకడను మారుస్తుంది. ఒకప్పుడు ముద్దు సన్నివేశాలకు హీరోహీరోయిన్లు ససేమిరా అనేవారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించాలి కాబట్టి.. అయితే ప్రేక్షకులు సైతం ఆలోచన విధానాన్ని మార్చుకొని సినిమాను సినిమాలా చూడడం మొదలుపెట్టడంతో టాలీవుడ్ లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి. ఇక కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ కి సిద్ధం అంటున్నారు. నాగార్జున,నాని, రవితేజ లాంటి వారు కూడా కుర్ర హీరోయిన్లతో పెదవులు కలుపుతున్నారు. అయితే…
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద…
న్యాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. గతేడాది క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని నానికి పెద్ద హిట్ ని కట్టబెట్టింది. కోల్ కతా నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెలింగ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. పవర్ ఫుల్ పాత్రలో నటించిన నాని నటనకు ఫ్యాన్స్ యే కాకుండా…
నాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. “మన చిత్ర పరిశ్రమలో మరో తెలివైన సినిమా.. శ్యామ్ సింగరాయ్ ఒక అద్భుతమైన అనుభవం రాహుల్ సాంకృత్యన్ . ఇప్పటివరకు…
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ…
టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్న చందానా ఈ ఇష్యూలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ప్రశ్నలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు…
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ అందుకున్న నాని జోష్ పెంచేశాడు. ఈ ఏడాది కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేసేశాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అలరించగా,.. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ జీరోత్ లుక్ ని రిలీజ్…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఆహా లో అన్ స్టాపబుల్ షో తో అలరిస్తున్న బాలయ్య.. ఆయన షో కి వచ్చిన హీరోల సినిమాలను వీక్షించారు. నిన్నటికి నిన్న పుష్ప సినిమాను ఫ్యామిలీతో వీక్షించిన బాలయ్య.. తాజాగా నాని శ్యామ్ సింగారాయ్ సినిమాను వీక్షించారు. బాలకృష్ణ కోసం నాని స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు…