న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ రోమ్ కామ్ ఎంటర్‌టైనర్ నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, స్పెషల్ వీడియో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాని పుట్టినరోజు కావడంతో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి నాని కి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. బర్త్ డే హోమం పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడు తన కుటుంబ సభ్యుల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. చిన్నతనం నుంచి అనేక గండాలు ఉన్నాయని హోమాలు చేయిస్తూ ఉంటారు.
ఇక హోమాల వలన, గండాల వలన విసిగిపోయిన సుందరం పడే ఫస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు. ఇక చివర్లో సుందరం చిన్నపిల్లాడిలా ‘మొహం పగిలిపోతుంది’ అని అమ్మా – అమ్మమ్మతో వాదించడం హిలేరియస్ గా అనిపించకమానదు. బ్రాహ్మణ యువకుడిగా నాని ఒదిగిపోయాడు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి సుందరానికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. “‘అంటే.. మా వాడి జాతకం ప్రకారం ‘బర్తడే హోమం’ జరిగిన 108 రోజులు వరకు బయటికి రాకూడదన్నారు. అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్ కి వస్తున్నాడు. హ్యాపీ బర్త్ డే సుందర్. బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు” అని చిత్ర బృందం పేర్కొంది. మరి ఈ సినిమాతో నాని ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.