న్యాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. గతేడాది క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని నానికి పెద్ద హిట్ ని కట్టబెట్టింది. కోల్ కతా నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెలింగ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. పవర్ ఫుల్ పాత్రలో నటించిన నాని నటనకు ఫ్యాన్స్ యే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని హీరో నాని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ చిరుతో కలిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు. శ్యామ్ సింగరాయ్ ని ఎవరు ప్రేమించారో చెప్పుకోండి అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ఇక ఫొటోలో శ్యామ్ సింగరాయ్ లో మీసం తిప్పినట్లు నాని, చిరు కలిసి మీసం మెలేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వారం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ సినిమాను వీక్షించి నాని నటనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే.
♥️ @KChiruTweets https://t.co/mB3uh2aJoC pic.twitter.com/xNjm7Rzyfc
— Nani (@NameisNani) January 20, 2022