న్యాచురల్ స్టార్ నాని గతేడాది శ్యామ్ సింగరాయ్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ని మేకర్స్ ప్రకటించారు.
ఫిబ్రవరి 24 న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక బర్త్ డే ట్రీట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. అంటే… మా యువ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా మేము జరుపుతున్న ఒక ‘Barthhday Homam’ ఫిబ్రవరి 23న సా||గం 4:05 ని||ల నుండి మొదలు.. అందరు ఆహ్వానితులే అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేసిన నాని.. ఏంటో అని సిగ్గుపడుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.ఈ పోస్టర్ లో నాని చిన్న పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తూ ఎంతో అమాయకంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఆ బర్త్ డాట్ ట్రీట్ ఏంటో చూడాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
Yentoo 🙈#AnteSundaraniki https://t.co/oZ3znSMOc3
— Nani (@NameisNani) February 22, 2022