నాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు.
“మన చిత్ర పరిశ్రమలో మరో తెలివైన సినిమా.. శ్యామ్ సింగరాయ్ ఒక అద్భుతమైన అనుభవం రాహుల్ సాంకృత్యన్ . ఇప్పటివరకు నాని, సాయి పల్లవిల నటనలో బెస్ట్ ఇదే. కంగ్రాట్యులేషన్స్ కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్.. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ కి, చిత్ర బృందాన్నీకి అభినందనలు” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Yet another brilliant film from our industry #ShyamSinghaRoy was a beautiful experience @Rahul_Sankrityn .@NameisNani & @Sai_Pallavi92 ‘s best performances till date.
— Ram Charan (@AlwaysRamCharan) January 8, 2022
Congratulations @IamKrithiShetty @MadonnaSebast14 👏🏼
Kudos to @NiharikaEnt and the entire team pic.twitter.com/A3MwhCe7sw