Manohar Lal Khattar: ఢిల్లీకి సాయం చేస్తా.. సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తించడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీకి తాము పూర్తి సాయం చేస్తామని అన్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో ఉన్నాయని హర్యానా సీఎం ఆరోపించారు. హర్యానా నుంచి అందుతున్న నీటికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెల్లించలేదన్నారు. ఢిల్లీ ప్రజలతో తాము ఉన్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ విదూషకులలా మాట్లాడటం సరికాదన్నారు ఆయన.
Suriya: రియల్ లైఫ్ లో రోలెక్స్ స్టార్ హీరోనే…
Also Read
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వంపై.. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరద నియంత్రణ ఆదేశాల మేరకు జరగాల్సిన సమావేశాన్ని గత రెండేళ్లుగా ఎందుకు నిర్వహించలేదో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు చెప్పాలని అన్నారు. వరదలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా ఎందుకు ప్రణాళిక రూపొందించలేదని ప్రశ్నించారు. మరోవైపు హర్యానా నుండి తక్కువ నీటిని విడుదల చేసినప్పుడు, ఢిల్లీ ఎలా ముంపునకు గురైందని కేజ్రీవాల్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అన్నారు. యమునా శుద్దీకరణ పేరుతో 6800 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు.
IND W vs BAN W: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా వరుసగా రెండోసారి ఓటమి..
ఢిల్లీలో భారీ వరదలకు కేంద్ర ప్రభుత్వం, హర్యానా సర్కారు చేసిన కుట్రే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయడం వల్లే యమునా నది నీటిమట్టం పెరిగి ఢిల్లీ వీధుల్లోకి నీళ్లు వచ్చాయని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!