మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వరుసగా చీతాలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 8 చీతాలు మృతిచెందగా.. తాజాగా మరో చీతా కన్నుమూసింది. భారత్ లో చీతాలు అంతరించిపోయాయని.. దేశంలో చీతాల సంతతిని పెంచడం కోసమని కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చారు. అయితే అవి ఒక్కొక్కటిగా మృతిచెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
AP CM Jagan: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎం రెడ్డి
కునో నేషనల్ పార్క్ లో తాజాగా మృతి చెందిన చీతా పేరు ధాత్రి. దాని ఆఫ్రికా నామధేయం తిబ్లిసి. అయితే కునో అభయారణ్యంలో చీతా చనిపోయి ఉండగా అధికారులు ఉదయం గుర్తించారు. అనంతరం చీతాను పోస్టుమార్టంకు తరలించారు. అయితే చీతా మరణానికి గల కారణాలు పోస్టుమార్టం వెల్లడి కానున్నాయి.
Allu Arjun Gifts Klin kaara: కోడలికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమిచ్చారంటే?
భారత్ లో చీతాలు 70 ఏళ్ల కిందట అంతరించిపోయాయి. దాంతో, గతేడాది కేంద్రం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చింది. వీటిలో జ్వాల అనే ఆడ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో మూడు పిల్లలు మరణించాయి. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 9 చీతాలు మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ లో ఒక చిరుత కూన సహా మొత్తం 15 చీతాలున్నాయి. వాటిలో ఏడు మగ చిరుతలు కాగా, ఏడు ఆడ చిరుతలు. ఒకటి చిరుత పిల్ల. ఈ చీతాలను రెగ్యులర్ గా పరిశీలిస్తున్నామని.. అవి ఆరోగ్యంగా ఉన్నాయని కునో నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు.