Lucknow: పాపం.. చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని చితక్కొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ కర్రీ అంటే లొట్టలేసుకుని తినే వారు చాలా మందే ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏవైనా పండగలప్పుడు కంచంలో కోడి ముక్క లేనిది ముద్ద దిగదు. చికెన్ అంటే ఇష్టపడే వాళ్లు చాాలా మంది ఉన్నారు. అయితే తాజాగా చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: Manipur: మణిపూర్ అల్లర్లు.. మరో 9 కేసులు విచారించనున్న సీబీఐ
Also Read
వివరాల్లోకి వెళ్తే.. చికెన్ ఉచితంగా ఇవ్వలేదని ఓ దళిత వ్యక్తిపై దాడికి పాల్పడ్డ.. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సుజన్ అహిర్‌వార్ అనే వ్యక్తి బైక్‌పై చికెన్‌ను అమ్ముతుంటాడు. అయితే ఒక ఊరి నుంచి మరో ఊరిలోకి వెళ్లే క్రమంలో మార్గమధ్యలో కొందరు నిందితులు అతన్ని అడ్డుకొని.. చికెన్ ఇవ్వమని అడిగారు. దానికి అతను డబ్బులు ఇస్తేనే.. చికెన్ ఇస్తామనడంతో ఆ వ్యక్తిని కొందరు యువకులు చెప్పులతో చితకబాదారు.
Read Also: Delhi: ఢిల్లీలో భారీ వాహనాలపై ఆంక్షలు
అయితే ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితుల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ దళితుడి పట్ల ఇలా చెప్పులతో దాడికి పాల్పడం సరికాదని.. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలంటూ అక్కడి దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ललितपुर में फ्री में मुर्गा नही देने पर जमकर जूतों चप्पल से पीटा, मुर्गा बेचकर परिवार का पालन पोषण करता है पीड़ित
#Lalitpur pic.twitter.com/ItNnTWSsLm— Lokesh Rai (@lokeshRlive) August 12, 2023
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!