Odisha: అయ్యో పాపం.. పెన్షన్ కోసం వెళితే పిల్లలు పుట్టకుండా చేశారే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనాభా పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయంలో తమ టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ఓ ఆశావర్కర్ దారుణానికి పాల్పడింది. పెన్షన్ ఇప్పిస్తానని ఒక మూగ యువకుడిని తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. అతని తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.
వివరాల ప్రకారం గాంగదురువ అనే 26 యేళ్ల యువకుడు ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్ పంచాయతీ అంబగూడలో ఉంటున్నాడు. అతను పుట్టుకతోనే మూగ. ఈ నెల 3వ తేదీన గ్రామానికి చెందిన ఆశా వర్కర్ అతని ఇంటికి వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి అతడిని మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అనంతరం అతడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఇంటికి వచ్చి మందులు వేసుకుంటున్న కుమారుడిని చూసి తల్లి అతడిని ఎందుకు మందులు వేసుకుంటున్నావని నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని తల్లికి వివరించాడు గాంగదురువ.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
Also Read: Balmoori Venkat : కేటీఆర్ షాడో సీఎం.. గ్రూప్ 2 వాయిదా వేయండి అని ట్వీట్ చేశాడు
దీంతో తల్లి తమ బంధువులతో వెళ్లి ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి ఆశావర్కర్ తప్పు చేసిందని నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని మల్కన్‌గిరి జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్ తెలిపారు. విచారణ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి బృందాన్ని మత్తిలి పంపించామన్నారు. దీనిలో మరో విచారకరమైన విషయం ఏంటంటే ఆ యువకుడికి ఇప్పటి వరకు ఇంకా పెళ్లికాలేదు. పెళ్లికాకుండా తన కొడుకును ఇలా చేశారంటూ అతని తల్లి రోదిస్తోంది.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు