Delhi Metro: G20 సమ్మిట్ కోసం ఢిల్లీ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్‌లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. G20 సమ్మిట్‌కు అవసరమైన భద్రతా ఏర్పాట్ల గురించి DCP (మెట్రో) రామ్ గోపాల్ నాయక్ శనివారం DMRC చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు లేఖ రాశారు.
Read Also: SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. దేశ రాజధానిలోని 39 మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. అందులో మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్‌లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు.
Read Also: IND vs NEP: భారత్‌తో మ్యాచ్.. నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్!
ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ 7 – 11 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (IGIA) ప్రయాణించే ప్రజలు మెట్రోను ఉపయోగించాలని సూచించారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?