ఇండియా పేరును భారత్‌గా మారుస్తామని, కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలను తొలగిస్తామని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ అన్నారు. పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చని మేదినీపూర్ ఎంపీ అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ సంప్రదాయాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
జీ- 20కి సంబంధించిన విందుకు ఆహ్వానంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని 'భారత రాష్ట్రపతి' అని సంబోధించడంపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. భారత్, ఇండియా అంటే ప్రేమ అని అన్నారు.
సాధారణంగా బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు ఎవరైనా ఎన్ని బిస్కెట్లు ఉంటాయో.. ఎంత బరువు ఉందో అని గమనిస్తారా?. చాలా మంది అయితే లేదు అనే సమాధానం ఇస్తారు. కానీ ఓ వినియోగదారుడు మాత్రం తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌ను మొత్తం గమనించాడు.
డీగ్ జిల్లాలోని గోపాల్‌గఢ్ పట్టణంలో సుమారు రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్‌ను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు పప్పి అలియాస్ మక్సూద్ను అరెస్టు చేశారు.