Rahul Gandhi: బీజేపీ ఆదివాసీలను అటవీవాసులుగా పిలుస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ‘రాజీవ్ యువ మితాన్ క్లబ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. భారత ప్రధాని అదానీపై విచారణ జరపలేరని, ఎందుకంటే విచారణ తర్వాత నష్టం అదానీకి కాదని విమర్శించారు. మరోవైపు జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు ధ్వంసమయ్యాయని, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని తప్పుపట్టారు.
Lifestyle : పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
బీజేపీ పని ప్రజలను విభజించడం, హింసను వ్యాప్తి చేయడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్ చేసే పని ప్రజలను ఏకం చేయడమని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చెప్పుకున్న గొప్పలను రాహుల్ ప్రస్తావిస్తూ, ప్రతి ఎన్నికలకు ముందు బీజేపీ ఒక సంఖ్య చెబుతుందని, కర్ణాటకలో కూడా 230 నుంచి 250 సీట్లు గెలుచుకుంటామని చెప్పుకుందని, కానీ కర్ణాటకలోని ప్రతి పేద వ్యక్తి కాంగ్రెస్‌కు ఓటు వేశాడని అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామన్న హామీని బీజేపీ నెరవేర్చలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ కోరారు. మరోవైపు గిరిజనులను బీజేపీ అటవీ వాసులుగా పిలుస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశమంతటా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని.. కానీ కాంగ్రెస్ చేసే పని కనెక్ట్ చేయడమేనని తెలిపారు. మణిపూర్, అస్సాం, కర్ణాటకలో బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని మండిపడ్డారు.
Curd Health Benefits: ప్రతీరోజు పెరుగు తింటే.. ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు..
ఛత్తీస్‌గఢ్‌లో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాయి. 48 లక్షల మంది యువ ఓటర్లు ఇక్కడ ఉండగా.. వీరిలో 4.43 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో 68 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ 15 సీట్లకే పరిమితమైంది. జేసీసీ (జే) ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందగా.. దాని భాగస్వామ్య పార్టీ బీఎస్‌పీ రెండు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ప్రస్తుత అసెంబ్లీలో 71 మంది సభ్యుల బలం ఉంది.
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!