ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏడాది(2023) క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అరుదైన ఘనత సృష్టించింది’ అని పేర్కొంది.
Also Read: Mumbai: ఛీఛీ నీచుడు.. డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే.. స్నేహితులతో కలిసి..
ఈ రికార్డుతో ఇప్పుడు ఇండిగో ప్రపంచంలోని అతిపెద్ద పది ఎయిర్‌లైన్స్ సరసన చేరింది. దేశంలోనే ప్రధాన ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థల సరసన చేరిందని ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణించిన చారిత్రక మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇండిగో కస్టమర్లు చూపిన ప్రేమ, విశ్వాసం, తమ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ మైలురాయిని చేరుకున్నామంటూ ఆయన పోస్ట్ షేర్ చేశారు.
Also Read: CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
First time ever 100 million customers flown in a year, 2023. #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/PKCkj4Q1Pm
— IndiGo (@IndiGo6E) December 18, 2023