Theft Case: దొంగతనం చేస్తే శిక్ష తప్పదు. అయితే చిన్నమొత్తంలో చోరీ చేస్తే ఎక్కడైనా పోలీసులు దండించి వదిలిపెట్టేస్తారు. మళ్లీ తప్పు చేయవద్దని హెచ్చరిస్తారు. అయితే రూ.45 దొంగతనం చేసినందుకు న్యాయస్థానం నాలుగురోజుల జైలుశిక్ష విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా 24 ఏళ్లకు ముందు జరిగిన ఈ చోరీ కేసులో ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడం గమనించదగ్గ విషయం. వివరాల్లోకి వెళ్తే.. 1998, ఏప్రిల్ 17వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మైన్‌పురి ఛపట్టీ…
Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్‌గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్‌కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రైల్వేస్టేషన్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లో నిర్మించనున్న వరల్డ్…
Lottery Tickets: కేరళలో లాటరీలు కొంతమందికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ఇటీవల కేరళలో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అతడికి రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే అందరినీ అలాంటి అదృష్టం వరించదు. నాణేనికి బొమ్మ ఉన్నట్లే బొరుసు కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పరిశీలిస్తే లాటరీ టిక్కెట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కష్టాలు పడే వాళ్లు కూడా ఉన్నారు. కేరళలోనే మరో వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు…
Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు…
Maharashtra: ప్రస్తుత రోజుల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వాలు భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. కానీ ఆ నగదును ప్రజల సౌకర్యాల కోసం వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలను కల్పించడంలో దారుణంగా విఫలం అవుతోంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యను తీర్చలేదు. కానీ 19 ఏళ్ల యువతి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు చేయలేని పని చేసి…
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా కానుకను అందించనుంది. ఏడో వేతన కమిషన్ ప్రకారం కేంద్రం త్వరలో డీఏ ప్రకటించనుందని ఓ నివేదిక ద్వారా స్పష్టమైంది. ఇప్పటికైతే అధికారికంగా వెల్లడి కాకపోయినా సెప్టెంబర్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలో…
Work From Home: తమ రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.…
Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ అనే…
Tamilnadu: అప్పుడెప్పుడో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాలో ‘నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా’ అనే పాట మీకు గుర్తుందా.. అయితే ఈ పాట తమిళనాడులోని ఓ బీజేపీ నేతకు సరిగ్గా సరిపోతుంది. బీజేపీ నేత శశికళ పుష్పకు ఆ పార్టీ నేత నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తమిళనాడులో బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో బీజేపీ నేత పొన్ బాలగణపతి ఆమె ఎడమ చేతిని తాకేందుకు ప్రయత్నించారు. అయితే శశికళ పుష్ప ఈ ప్రయత్నాన్ని…
వైద్యం అంటే మామూలుగా వుండదు మరి. ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో వైద్యుల దగ్గరకు వెళ్లింది. తనకు కడుపు నొప్పిగా వుందని చెప్పడంతో.. వైద్యులు స్కానింగ్ చేయాలన్నారు. దీంతో ఆమె స్కానింగ్ చేయించగా వైద్యులు షాక్ తిన్నారు. ఆమెకు ఆవిషయం గురించి చెప్పగా బాధితురాలు షాక్ నుంచి తేరుకోలేక పోయింది. ఇంతకీ ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సునీతాదేవి కి 33 ఏళ్లు. అమె తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న…