Supreme Court: హిజాబ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కామన్ డ్రెస్ కోడ్.. సుప్రీంకోర్టు ఏమందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద నమోదైన విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్ని స్కూళ్లు, కాలేజీలలో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై విచారణను నిరాకరించింది. దేశంలో జాతీయ సమగ్రతను, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడానికి కామన్ డ్రెస్ కోడ్ అవసరమంటూ నిఖిల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Read Also: Saudi Arabia: వీడు మామూలోడు కాదు.. 43 ఏళ్లలో 53 సార్లు పెళ్లి చేసుకున్నాడు.
Also Read
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
పాఠశాలలు, విద్యా సంస్థల్లో లౌకికతత్వాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా కామన్ డ్రెస్ కోడ్ అవసరమని పిటిషనర్ పేర్కొన్నారు. విద్యాసంస్థల లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కామన్ డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టడం చాలా అవసరమని.. లేకుంటే రేపటి రోజున నాగ సాధువులు కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చని.. అప్పుడు తమ అవసరమైన మతపరమైన ఆచారాలను ఉదహరిస్తూ బట్టలు లేకుండా తరగతికి హాజరు కావచ్చని పిటిషనర్ వివరించారు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశమని, విద్యా హక్కు చట్టం కింద ఈ అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.ధులియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. అయితే ఇది కోర్టుకు రావాల్సిన అంశమే కాదని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకోలేమంటూ విచారణకు నిరాకరించింది. కాగా కర్ణాటకలో ఇటీవల వెలుగులోకి వచ్చిన హిజాబ్ వివాదం నేపథ్యంలోనే పిటిషనర్ ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!