Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.…
ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా పలు వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ-కామర్స్ సైట్‌లో బుక్ చేసే ఆర్డర్ మీకు ఎలా డెలివరీ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది బుక్ చేసే పార్శిళ్లలో వస్తువులు డ్యామేజ్ అయితే డెలివరీ బాయ్స్ కారణమని నిందిస్తుంటారు. కానీ ఆ పార్శిళ్లు ఎక్కడి నుంచి రవాణా అయ్యాయి.. ఎలా రవాణా అయ్యాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పార్శిల్ భద్రత గురించి డెలివరీ…
Neet Exam: నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. జూలై 17న కొల్లాం జిల్లా ఆయుర్‌లో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులు అవమానానికి గురయ్యారు. మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది అమ్మాయిల లోదుస్తులు విప్పించారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు బ్రా తీసి వెళ్లాలంటూ ఆదేశించారు. ఈ ఘటనపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల లో దుస్తులు…
Admissions in Psychology Courses: దేశవ్యాప్తంగా సైకాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు 50 శాతం పెరిగాయి. ఆనర్స్, పీజీ లెవల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో సైకాలజీగా బాగా డిమాండ్ పెరిగింది. డిగ్రీలో ఏ గ్రూప్ చదివినవారైనా సైకాలజీని సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం
School Syllabus: 'బోడి చదువులు వేస్టు.. నీ బుర్రంతా భోంచేస్తూ.. ఆడి చూడు క్రికెట్టూ.. టెండుల్కర్ అయ్యేటట్టు..' అని తెలుగు సినిమా పాటొకటి ఉంది. సంపాదించటానికి చదువుల కన్నా ఆటలు బెటరని బోధించింది. నిజమే కదా అనిపించేలా చేసింది. సూపర్ హిట్ అయింది. శ్రోతలను
Shocking snake Video: పాము పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. అదే పాము నిజంగా కళ్లకు కనిపిస్తే షేక్ అవ్వాల్సిందే. అయితే కర్ణాటకలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సీన్ చోటుచేసుకుంది. ఓ బాలుడు యథావిధిగా ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి దిగుతూ తెలియక పాముపై కాలేశాడు. వెంటనే తల్లి స్పందించి క్షణాల్లో అతడిని పక్కకు లాగేయడంతో ప్రాణప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం…
India will beat China: మన దేశం నుంచి బ్రిటన్‌కి వెళ్లే విద్యార్థుల సంఖ్య నాలుగైదేళ్ల కిందట దాదాపు 20 వేలు మాత్రమే ఉండేది. కానీ ఈ సంఖ్య గతేడాది ఏకంగా లక్ష వరకు చేరింది. ఈ సంవత్సరం మరింత పెరగనుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు చైనా నంబర్-1 ప్లేస్‌లో ఉండేది.
Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్‌లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100…
Har Ghar Tiranga: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా జెండాలను విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజుల్లో ఏకంగా కోటి…
PaniPuri Effect: వర్షాకాలంలో రోడ్లపై విక్రయించే పానీపూరి తినవద్దని వైద్యులు సూచిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. తాజాగా పానీపూరి తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. హుగ్లీ జిల్లా డొగాచియాలోని ఓ స్టాల్ వద్ద పానీపూరీ తిన్నవారిలో చాలామందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు…