Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా కానుకను అందించనుంది. ఏడో వేతన కమిషన్ ప్రకారం కేంద్రం త్వరలో డీఏ ప్రకటించనుందని ఓ నివేదిక ద్వారా స్పష్టమైంది. ఇప్పటికైతే అధికారికంగా వెల్లడి కాకపోయినా సెప్టెంబర్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించాక డీఏ శాతాన్ని అధికారులు వెల్లడించనున్నారు.
Read Also:Shoaib Akhtar: ఫస్ట్ రౌండ్‌లోనే వెనక్కి వస్తారు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. జనవరి నుంచి జూన్ వరకు తొలిసారి డీఏను సవరించనుండగా.. జూలై నుండి డిసెంబర్ వరకు పరిగణనలోకి తీసుకుని రెండోసారి డీఏను సవరిస్తారు. ఉద్యోగుల డీఏ ఎంత పెరుగుతుందనే దాని కోసం కేంద్ర ప్రభుత్వం AICPI-IW (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్) ఇండెక్స్ డేటాను ఉపయోగిస్తుంది. ఏప్రిల్ 2022కి ఆలిండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-IW 1.7 పాయింట్లు పెరిగి 127.7 వద్ద నిలిచింది. ఒక నెలకు సంబంధించి శాతం మార్పును పరిశీలిస్తే ఏడాది క్రితం సంబంధిత నెలల మధ్య నమోదైన 0.42 శాతం పెరుగుదల నమోదైంది. గత నెలతో పోలిస్తే ఇది 1.35 శాతం పెరిగిందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. తాజా మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం మే నెలలో AICPI గణాంకాలు 129 వద్ద ఉన్నాయి. ఇదిలా ఉండగా జూన్ నెలలో AICP ఇండెక్స్ DA ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. ఇండెక్స్ పెరగడం వల్ల డీఏ పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ డీఏ పెరిగితే కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.