Kashmir: ప్రకృతి సౌందర్యానికి, మంచు అందాలకు నిలయమైన కాశ్మీర్ భారతదేశపు స్వర్గభూమిగా పేరొందింది. అందుకే పర్యాటకలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా కరోనా, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు కాశ్మీర్ లోయకు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రికార్డు స్థాయిలో ప్రజలు ఈ ప్రాంతంలో పర్యటించారు.
World Largest Pen: సాధారణంగా మనం రాసుకునే పెన్ను జానా బెత్తెడు ఉంటుంది. అంత సైజు ఉంటేనే పెన్నుతో మనం రాయగలం. కానీ అదే పెన్ను 20 అడుగులు ఉంటే అది రికార్డే అవుతుంది. తాజాగా దేశంలోని ఓ పెన్ను ప్రపంచంలోనే అతి పెద్ద పెన్నుగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని నౌరంగాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ అట్రీ అతిపెద్ద ఇంక్ పెన్ను తయారు చేశాడు. 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు…
Make Love Not War: ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు ఓ జంట ప్రేమ కూడా నడిపిస్తోంది. రష్యాలో జన్మించిన వ్యక్తి, ఉక్రెయిన్‌లో జన్మించిన మహిళ ప్రేమించుకుని భారత్‌లో ఒక్కటయ్యారు. ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 5న తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల ఉక్రెయిన్…
Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త-పార్ట్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. రణబీర్ పూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండటం చిత్రబృందాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. దీనిపై స్టార్ ఇండియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని అనధికారికంగా…
Police fighting: సాధారణంగా రోడ్డుపై సామాన్యులు కొట్లాటకు దిగితే పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటారు. కానీ అదే పోలీసులు కొట్టుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్ జలౌన్‌లో తాజాగా ఇద్దరు పోలీసులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సదరు పోలీసులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న హోంగార్డు, కానిస్టేబుల్‌కు మధ్య ఘర్షణ తలెత్తగా…
National Green Tribunal: తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం వంటి నిర్వహణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు నెలల్లో రూ.3500 కోట్లు జరిమానా చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. గడువు దాటితే అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలపై రూ.12,818.99 కోట్లు కేటాయించినప్పటికీ మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల…
Tree Cut in Kerala: మనుషులకే కాదు మూగజీవులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అందులోనూ పక్షులు తమ తోటి పక్షులకు ఏదైనా అపాయం జరిగితే విలవిలలాడిపోతాయి. ఈ విషయంలో మనుషులు చలించకపోయినా పక్షులు తక్షణమే స్పందిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియోలో అందరినీ అయ్యో అని కళ్లు చమ్మగిల్లేలా చేస్తోంది. ఈ హృదయవిచారక ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలో రోడ్డు విస్తరణ కోసం వందేళ్ల నాటి పురాతన చెట్టును అధికారులు ఒక్కసారిగా నరికేశారు. దీంతో…
Survey on Romance: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-5లో తాజాగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5లో భాగంగా మన దేశంలో తొలిసారిగా శృంగారంపై సర్వే చేశారు. రొమాన్స్‌లో కండోమ్ వాడకంపైనా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. వయసులో ఉన్న వంద మంది మహిళల్లో కేవలం 2 శాతం మందే గతేడాది రొమాన్స్‌లో పాల్గొన్నారు.
First Virtual School in India: దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్‌ని నిన్న బుధవారం ప్రారంభించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్‌మెంట్ తప్పు అంటూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) ఖండించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పినదాని ప్రకారం.. ఈ స్కూల్‌లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా స్టూడెంట్స్ అడ్మిషన్ పొందొచ్చు.
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు…