Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్ కోడ్ కచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2023 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ బార్ కోడ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, అడ్రస్ తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడువు తేదీ వివరాలను కంపెనీలు పేర్కొనాల్సి ఉంటుంది.…
Iron Rod: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి మృత్యువు కాటేస్తుంది. కానీ రైలులో కూర్చున్న ప్రయాణికుడికి మృత్యువు కిటికీలో నుంచి దూసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎవరి ఊహకు అందదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హరికేశ్ కుమార్ దూబే అనే వ్యక్తి విండో సీటు పక్కన కూర్చున్నాడు. తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ…
సిరిసిల్లలో మరోసారి ఫ్లెక్సీల కళకం బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకం రేపాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఏడ్చే మగవాళ్లను నమ్మవద్దని పురాణాలు చెబుతున్నాయి అని ఫ్లెక్సీలో ఉంది. ఓ వైపు బండి సంజయ్ కళ్లలోంచి నీరు కారడం మరో వైపు అమ్మాయి నవ్వుతుండటం ఫోటో పెట్టారు. ఫ్లెక్సీలో నవ్వే ఆడవాళ్లను…
Youtuber Harassment : కొరియన్ మహిళా యూట్యూబర్ పై ఇద్దరు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న మహిళను వారు వేధించారు. యువకులు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు.
Sabarimala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. మండల, మకరవిలక్కు పూజల కోసం ఈనెల 16 నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కేవలం 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. అత్యధికంగా అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్లు, హుండీల ద్వారా రూ.12.73 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు వచ్చిందని దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది…
నేడు నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు.
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దేశం కంటే భార్య పోటీ చేస్తున్న ఎన్నికలు ముఖ్యమా అని నిలదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జడేజా గాయం కారణంగా ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకోవడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి కూడా దూరంగా ఉన్నాడు. అయితే వచ్చేనెలలో జరిగే బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ జడేజాను ఎంపిక చేసింది. కానీ తనకు ఇంకా…
Selfie Tragedy: ప్రస్తుతం ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి సెల్ఫీల మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో నలుగురు యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలను బలి తీసుకుంది. బెళగావి జిల్లాలో శనివారం మధ్యాహ్నం వాటర్ ఫాల్ వద్ద నలుగురు యువతులు సెల్ఫీ తీసుకుంటుండగా నీళ్లలో జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది…
Rail Engine Theft: బీహార్లో రైలు ఇంజిన్ను కొంతమంది దొంగలు మాయం చేశారని.. సొరంగంలోకి ఇంజిన్ను తీసుకువెళ్లి ముక్కలుగా మార్చి వివిధ జిల్లాలోని స్క్రాప్ దుకాణాల్లో అమ్మేశారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని వాళ్లు స్పష్టం చేశారు. బెగుసరాయ్ జిల్లా బరౌనీ ప్రాంతంలోని గర్హరా రైల్వేయార్డులో ఒక స్పేర్ రైల్ ఇంజిన్ ఉంచామని.. అందులోకి దొంగలు ప్రవేశించి కొన్ని కేబుళ్లను…