Ahmedabad: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను తలదన్నేలా అహ్మదాబాద్ రైల్వేస్టేషన్.. ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్‌గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్‌కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రైల్వేస్టేషన్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లో నిర్మించనున్న వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఊహా చిత్రాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
త్వరలోనే అహ్మదాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ రైల్వే స్టేషన్ వసతుల విషయంలో ఏ ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అహ్మదాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న మరో బహుమతిగా ఈ రైల్వే స్టేషన్ నిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వేస్టేషన్ ఊహాచిత్రాలను చూస్తుంటే వావ్ అని నెటిజన్‌లు నోరెళ్లపెడుతున్నారు. అటు ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ కోసం స్పెషల్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కొన్ని వందల కోట్లను ఖర్చుపెడుతున్నారు. ఇప్పుడు రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిధులను ఉపయోగించబోతున్నారు. అయితే అన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గుజరాత్‌కే తరలించడాన్ని కొన్ని రాష్ట్రాలు తప్పుబడుతున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
Iconic!
PM @NarendraModi's gift to Ahmedabad and Gujarat will be a world class Railway Station which will beat any international airport. pic.twitter.com/MX6k94GLIL
— Piyush Goyal (@PiyushGoyal) September 28, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!