అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు, అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాముల శరీరాలపై మైక్రో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలో ప్రయాణించిన 17 మంది వ్యోమగాములపై చేసిన అధ్యయనం వారిలో ఎముకల సాంద్రత తగ్గుతున్నట్లు గమనించింది. అయితే అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎముకల సాంద్రత తగ్గినా.. భూమి మీదకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ బోన్ డెన్సిటీ పెరుగుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ వ్యోమగాముల్లో మోకాలు కింది ప్రాంతం టిబియా ఎముక వద్ద…
విశ్వాంతరాలను తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. మనం ఎవరం, ఈ విశ్వమేంటి.. అసలు మనం ఎక్కడ ఉన్నాం.. భూమి లాంటి గ్రహాలు మరెక్కడైనా ఉన్నాయా..? అనే సందేహాలు నిత్యం తొలుస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మన పాలపుంత గెలాక్సీకి చెందిన వివరాలనే మనిషి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. అలాంటి కొన్ని బిలియన్ల గెలాక్సీలు అందులో కోటానుకోట్ల నక్షత్రాలు, మన ఊహకు కూడా అందని అంత విశ్వ రహస్యాలను కనుకునేందుకు మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే…
ఈ సువిశాల విశ్వంలో మానవుడు తెలుసుకున్నది దాదాపుగా మహాసముద్రంలో నీటి బిందువు అంతే. కానీ మానవుడి నిరంతర పరిశోధనల ద్వారా విశ్వానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏలియన్స్ జాడతో పాటు, విశ్వంలో భూమిని పోలిన గ్రహాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భూమిని పోలిన గ్రహాలను కనుక్కున్నారు. ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉండే వీటిని చేరాలంటే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాదాపుగా అసాధ్యం. నిజానికి మానవుడు ప్రయోగించిన ఏ…
అంతరిక్షంలో తరచూ కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. కొన్ని గ్రహశకలాలు భూమిపైకి దూసుకొస్తాయి.. కొన్ని సార్లు ప్రమాదం జరిగినా.. చాలా సార్లు ప్రమాదాలు తప్పాయి.. అయితే, అంతరిక్షం నుంచి మరో ప్రమాదం రాబోతోంది.. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఈ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని చెప్పింది. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే…
అంతరిక్షం నుండి మన స్వంత రాష్ట్రం లేదా నగరం ఎలా కనిపిస్తుందో చూడటం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. దానికి మరికొంత ఉత్కంఠను జోడిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హైదరాబాద్ సిటీ లైట్లు ఎలా కనిపిస్తున్నాయనే చిత్రాన్ని నాసా తాజాగా విడుదల చేసింది. సిటీ లైట్లు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులుగా ఉన్నాయి – ఈ స్టేషన్ దక్షిణాసియా ఉపఖండం నుండి 262 మైళ్ల దూరం కక్ష్యలో ఉన్నట్లు చిత్రీకరించబడింది. కైరో, ఈజిప్ట్ నుండి –…
గత సంవత్సరం కాలంగా ఆరుణ గ్రహంపై రోవర్ పెర్సెవెరెన్స్ పరిశోధనలు జరుపుతున్నది. అరుణగ్రహంపై ఉన్న మట్టిని, రాళ్లను సేకరించి దానిని ప్రత్యేకమైన ట్యూబులలో నిల్వ చేస్తున్నది. పరిశోధన అంశాలను భూమిమీకు పంపుతున్నది మార్స్ రోవర్. అయితే, ఈ క్యూరియాసిటీ రోవర్ ఫిబ్రవరి 13, 2022న మార్స్ పై ఓ వింత వస్తువును కనిపెట్టింది. చూసేందుకు ఆ వస్తుతవు పాతకాలపు పాత్ర మాదిరిగా ఉండటంతో ఆసక్తి నెలకొన్నది. క్యూరియాసిటీ రోవర్ ఆ వస్తువు ఏంటి అనే దానిపై ప్రస్తుతం…
మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా పెర్సెవెరెన్స్ రోవర్‌ను గతంలో ప్రయోగించింది. ఈ రోవర్ గతేడాది ఫిబ్రవరి 18 వ తేదీన మార్స్ గ్రహంపై ల్యాండ్ అయింది. రోవర్ మార్స్ పై పరిశోధనలు చేపట్టడం ప్రారంభించి నేటికి ఏడాది కావడంతో నాసా శుభాకాంక్షలు తెలియజేసింది. రోవర్ తయారీలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆరుచక్రాలు కలిగిన ఈ రోవర్ మార్స్‌పై సంవత్సరం పాటు పరిశోధనలు చేసేలా రూపొందించారు. మార్స్‌పై ఒక ఏడాది అంటే భూమిపై 687 రోజులు అని…
2030 తరువాత మనిషి ఎలాగైనా మార్స్ మీదకు వెళ్లాలని, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. దానికోసమే కోసమే మార్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా నీరు కావాలి నీరు ఉంటేనే అక్కడ మానవ ఆవాసం సాధ్యం అవుతుంది. మార్స్‌పై నీటి జాడలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేస్తున్నది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న మార్స్ రికనసెన్స్ ఆర్బిటార్ కీలక విషయాలను తెలియజేసింది. Read: కోట్లాది…
ఇటీవలే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లోని అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైన దృశ్యాలను నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించింది. టోంగా దీవుల్లో బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన శక్తి హిరోషిమా అణుబాంబు శక్తి కంటే 200 రెట్లు అధికంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్నిపర్వతం బద్దలైనపుడు వెలువడిన బూడిద సుమారు 40 కిలో మీటర్ల మేర వ్యాపించిందని, పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, కాలువలు, చెరువులు, నదులు బూడిదతో నిండిపోయిందని నాసా తెలియజేసింది.…
గతేడాది డిసెంబర్ 25 వ తేదీన ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి నాసా, యూరప్, కెనడా దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అతిపెద్ద టెలిస్కొప్ జేమ్స్ వెబ్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వివిధ కక్ష్యలను దాటుకొని సుమారు 15 లక్షల కిమీ దూరం ప్రయాణించి రెండో లాంగ్రెంజ్ పాయింట్‌ను చేరుకుంది. అక్కడి నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం నుంచి వివిధ సమాచారాన్ని సేకరించి భూమికి పంపనున్నది. Read: What’s…