నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
NISAR: భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా తయారు చేసిన ‘ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన ‘‘’NASA ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) శాటిలైట్’’ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సాంకేతిక అద్భుతం, గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెబతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రాణాలను కాపాడేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 1.3 బిలియన్ డాలర్ల పైగా ఖర్చుతో భారత్, అమెరికాలు కలిసి ఈ శాటిలైట్‌ని రూపొంందించాయి. భారత్ లోని శ్రీహరికోట లాంచింగ్ సెంటర్ నుంచి ఈ…
Shubanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న…
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి పైకి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆక్సియం-4 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు 18 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్న తర్వాత భూమికి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నలుగురిలో భారతదేశానికి చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత ఆయన భూమికి చేరుతారు.
Shubhanshu shukla: ఆక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ జూలై 14వ తేదీన భూమి పైకి తిరిగి రాబోతున్నారని నాసా ప్రకటించింది.
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. గురువారం ఆక్సియం-4 వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ అయింది. ఐఎస్ఎస్ చేరిన తర్వాత తన అనుభవాన్ని శుభాన్షు వివరించారు. ‘‘ఇది తేలికగా అనిపించిందని, కానీ తన తల కొంచెం బరువుగా ఉంది’’ అని అన్నారు. ఆయన అధికారికంగా వ్యోమగామి నంబర్ 632, అంతరిక్ష కేంద్రం పిన్ పొందారు. రాబోయే రెండు వారాలు గొప్పగా ఉంటుందని చెప్పారు.
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టి శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన ఘటన సాధించారు. ఆక్సియం-4 ఐఎస్ఎస్తో డాక్ అయింది.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షంలోకి వెళ్తున్నారు. రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించబోతున్నాడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లాడు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. ఆరు సార్లు ప్రయోగం వాయిదా పడింది. బుధవారం యాక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది.