ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ అద్భుత సమయం రానే వచ్చేసింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి అంతరిక్ష చిత్రం విడుదల అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షరాలు కమలా హ్యారిస్ ఈ ఫోటోను వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. కనులవిందుగా ఉండే ఈ చిత్రంలో నక్షత్రాలు, భారీ గేలక్సీలను మనం స్పష్టంగా చూడొచ్చు.
ఈ సందర్భంగా.. మానవాళి ఇప్పటివరకూ చూడని సుదూరమైన ఇన్‌ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వెల్లడించారు. విశాలమైన విశ్వంలో ఈ దృశ్యం కేవలం ఒక చిన్నపాటి మచ్చ వంటిదేనన్న ఆయన.. ఇప్పుడు మనం 13 బిలియన్ సంవత్సరాలు వెనక్కు వెళ్లి చూస్తున్నామన్నారు. ఈ చిత్రంలోని కాంతి 1300 సంవత్సరాల నుంచి ప్రయాణిస్తూనే ఉందని, ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరెన్నో రహస్యాల్ని ఛేదించాల్సి ఉందని చెప్పారు. కాగా.. ప్రపంచంలోనే శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌గా జేమ్స్ వెబ్ స్పేస్ రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్‌లో దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఈ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించారు.
ఇదిలావుండగా.. శాస్త్రవేత్తలు గతంలోనే వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ చిత్రం కంటే సుదూరమైన చిత్రాలను గుర్తించారు. నాన్-ఇన్‌ఫ్రారెడ్ మిషన్‌లో భాగంగా.. మహా విస్పోటం (బిగ్ బ్యాంగ్) నాటి చిత్రాలను కనుగొన్నారు. కోబ్, డబ్ల్యూఎంఏపీ గుర్తించిన చిత్రాల్లో.. బిగ్ బ్యాంగ్ జరిగిన 3.8 లక్షల సంవత్సరాల తర్వాతి దృశ్యాలున్నాయి. కాకపోతే.. ఆ చిత్రాల్లో మైక్రోవేవ్ రేడియేషన్ మాత్రమే ఉన్నాయి. తొలిసారి వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రంలో నక్షత్రాలు, గెలాక్సీలు కనిపిస్తున్నాయి.
👀 Sneak a peek at the deepest & sharpest infrared image of the early universe ever taken — all in a day’s work for the Webb telescope. (Literally, capturing it took less than a day!) This is Webb’s first image released as we begin to #UnfoldTheUniverse: https://t.co/tlougFWg8B pic.twitter.com/Y7ebmQwT7j
— NASA Webb Telescope (@NASAWebb) July 11, 2022