భూమివైపు అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది. 1994 పీసీ 1 గా దీనికి నామకరణం చేశారు. మొదటిసారిగా దీనిని రాబర్ట్ మెక్‌నాట్ అనే ఖగోళ శాస్త్రవేత్త 1994 ఆగస్ట్ 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంలకు 43,754 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తున్నది. అయితే, ఇది భూమి నుంచి సుమారు 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్తుందని, దీని వలన భూకక్ష్యలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. జనవరి 18,…
భూమిలాంటి గ్రహాలు ఈ విశాలమైన విశ్వంలో అనేకం ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒకవేళ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు. వారు మనుషుల కన్నా టెక్నికల్‌గా అభివృద్ధి సాధించిన వ్యక్తులా లేదా, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నాసా ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే గ్రహాంతరవాసుల జాడను కనుగొని తీరుతామని నాసా చెబుతున్నది. దీనికోసం 24 మంది పూజారుల సహాయం తీసుకోబోతున్నది. వివిధ మతాలకు చెందిన నిష్ణాతులైన పూజారులను దీనికోసం వినియోగించుకోబుతున్నది నాసా.…
మనిషి భవిష్యత్తులో భూమి మీద నుంచి చంద్రునిమీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతారవణంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేశారు. చంద్రునిపైన, మార్స్ పైనా ఘనీభవించిన మంచు జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. Read: మరో రికార్డ్ సృష్టించిన…
టెక్నాలజీ అభివృద్ది చెందిన తరువాత మనిషి తన అవసరాల కోసం, ప్రపంచం మనుగడ కోసం రోబోలను తయారు చేశాడు. ఈ రోబోలు మనిషికి అన్ని రంగాల్లోనూ సహకరిస్తున్నాయి. కృత్రిమ మేధతో తయారైన రోబోలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా రోబోలకు ఉంటుందనడంలో సందేహం అవసరం లేదు. మనుషులు ఆలోచించిన విధంగానే రోబోలు కూడా ఆలోచించగలిగితే మనిషి మనుగడకే ప్రమాదం కావొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2021లో చాలా…
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్‌ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్…
చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కొన్నిసార్లు అవసరం లేదని పడేసిన వస్తువుల విలువ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలానే యూకేకు చెందని జేమ్స్ హువెల్స్ మాజీ భార్య 2013 వ సంవత్సరంలో పనికి రాదేమో ఆని చెప్పి ఓ హార్డ్ డిస్క్‌ను చెత్తబుట్టలో పడేసింది. ఆ హార్డ్ డిస్క్ విలువ ఇప్పుడు రూ.3,404 కోట్లు. వామ్మో అంత విలువనా… అందులో ఏముంది అనే డౌట్ రావొచ్చు. ఆ హార్డ్ డిస్క్‌లో 7500 బిట్ కాయిన్స్…
నాసా మరో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సూర్యుడిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా సౌరతుఫానులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ సౌర తుఫానులు భూమివైపు త్వరలోనే దూసుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అతిత్వరలోనే రెండు సౌరతుఫానులు భూమిని తాకే అవకాశం ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునిలో ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్ డ్రైవ్ అవుతుంటుంది. ఆ సమయంలో సూర్యునిలో ఉండే అయస్కాంత దృవాలు మారుతుంటాయి. Read: స్మార్ట్…
సూర్యుడు, భూమి మద్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం ఉన్నప్పటికీ సూర్యుడి నుంచి వెలువడే కాంతి, వేడి భూమిని చేరుతుంటాయి. సమ్మర్ వచ్చింది అంటే వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటాం. అంతటి వేడున్న సూర్యుని వద్దకు చేరుకోవాలంటే అయ్యేపనేనా… అంటే కాదని చెప్తాం. అసాధ్యాన్ని నాసా సుసాధ్యం చేసి చూపించింది. కొన్ని నెలల క్రితం నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఏప్రిల్ 28 వతేదీన సోలార్ కరోనాలోకి…
అమెరికా మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమయింది. విశ్వం పుట్టుక రహస్యాన్ని కనుగొనేందుకు కీలక ప్రయోగం చేయబోతున్నది. డిసెంబర్ 22 వ తేదీన ఫ్రెంచ్ గయానాలోని ఏరియల్ స్పైస్ 5 రాకెట్ ద్వారా జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ సహకారంతో సాసా ఈ టెలిస్కోప్‌ను తయారు చేసింది. సుమారు 25 ఏళ్లపాటు 10 వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్ల పనిదినాలు పనిచేసి, ఈ టెలిస్కోప్‌ను తయారు చేశారు.…
చంద్రుడిపై కాలు మోపేందుకు, కాలనీలు ఏర్పాటు చేసేందుకు నాసా యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం నాసా ఆర్టిమిస్ పేరుతో బృహత్కర ప్రాజెక్టును చేపట్టింది. ఆర్టిమిస్ ప్రాజెక్టులో భాగంగా 2022లో మానవరహిత రాకెట్‌ను చంద్రునిమీదకు పంపించబోతున్నది. అనంతరం 2024 నుంచి మానవసహిత రాకెట్లను చంద్రునిమీదకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆర్టిమిస్ 9 కోసం భారీ బూస్టర్లకు పెద్ద ఎత్తున ఆర్డర్లు చేసింది. నార్తరప్ గ్రూమన్ కు ఈ బూస్టర్ల తయారీ బాధ్యతలను అప్పగించింది. నాసా ప్రాజెక్టులకు…