అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు, అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాముల శరీరాలపై మైక్రో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలో ప్రయాణించిన 17 మంది వ్యోమగాములపై చేసిన అధ్యయనం వారిలో ఎముకల సాంద్రత తగ్గుతున్నట్లు గమనించింది. అయితే అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎముకల సాంద్రత తగ్గినా.. భూమి మీదకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ బోన్ డెన్సిటీ పెరుగుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ వ్యోమగాముల్లో మోకాలు కింది ప్రాంతం టిబియా ఎముక వద్ద 2.1 శాతం ఎముక సాంద్రత, 1.3 శాతం ఎముకల బలం తగ్గినట్లు గుర్తించారు. సగటున 47 ఏళ్లు కలిగి, 5.5 నెలలు అంతరిక్షంలో ఉన్న 14 మంది పురుషులు, ముగ్గురు మహిళా వ్యోమగాములపై ఈ పరిశోధనలు చేశారు. యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా, కెనడియన్ స్పెస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ కు చెందిన వ్యోమగాములపై పరిశోధలు జరిగాయి.
Read Also: IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే
భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత కూడా బోన్ డెన్సిటీని పొందలేదు. అంతరిక్షయానంలో వ్యోమగాములు బోన్ డెన్సిటీని కోల్పోతారని తెలుసని.. ఆ సమయంలో ఎముకల నిర్మాణాలు సన్నగా మారడంతో పాటు ఎముకల జాయింట్ల విడిపోతాయని.. అయితే భూమికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ యథాస్థితికివస్తాయని కల్గరీ యూనివర్సిటీ ప్రోఫెసర్ గాబెల్ అన్నారు. అయితే అంతరిక్షంలో వ్యోమగాముల ఎములకు జరిగిన నష్టం శాశ్వతంగా ఉంటుందని ఆయన అన్నారు.
అంతరిక్షంలో మైక్రో గ్రావిటీ వల్ల మానవ శరీర వ్యవస్థ ప్రభావితం అవుతోంది. బోన్ డెన్సిటీ తగ్గడంతో పాటు రేడియేషన్, గుండె నాళాల వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. భూమిపై ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల రక్తం పాదాల వైపు ప్రవహిస్తుంది. అదే స్పేస్ లో ఉన్నప్పుడు రక్తం శరీర పైభాగంలో ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో పాటు రేడియేషన్ వల్ల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారంటున్నారు.