అంతరిక్షం నుండి మన స్వంత రాష్ట్రం లేదా నగరం ఎలా కనిపిస్తుందో చూడటం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. దానికి మరికొంత ఉత్కంఠను జోడిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హైదరాబాద్ సిటీ లైట్లు ఎలా కనిపిస్తున్నాయనే చిత్రాన్ని నాసా తాజాగా విడుదల చేసింది. సిటీ లైట్లు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులుగా ఉన్నాయి – ఈ స్టేషన్ దక్షిణాసియా ఉపఖండం నుండి 262 మైళ్ల దూరం కక్ష్యలో ఉన్నట్లు చిత్రీకరించబడింది. కైరో, ఈజిప్ట్ నుండి – కనిపించే లైట్ల యొక్క నాలుగు చిత్రాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
యాన్బు, సౌదీ అరేబియా; హైదరాబాద్, భారతదేశం, మరియు బ్యాంకాక్, థాయిలాండ్ చిత్రాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ట్విట్టర్‌లో పంచుకుంది. ఈ చిత్రాలు ఇప్పుడు నాసా ‘సిటీస్ ఎట్ నైట్’ ఆల్బమ్‌కు జత చేసింది. ఇందులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి రాత్రిపూట అనేక నగరాలు ఎలా కనిపించాయో సుమారు 180 ఫోటోలు ఉన్నాయి. మీరు కూడా చూసేయండి.
City lights from: Cairo, Egypt; Yanbu, Saudi Arabia; Hyderabad, India; and Bangkok, Thailand! 🌃🌏 For more, visit https://t.co/4yfkLZZfVU pic.twitter.com/8UOynpxuV8
— International Space Station (@Space_Station) March 5, 2022