అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన రోవర్ రెడ్ ప్లానెట్‌లోని జెజెరో క్రేటర్‌లో అద్భుతమైన మార్టిన్ శిలలను కనుగొంది. అవి నీటికి సంబంధించిన జాడలను కలిగి ఉండవచ్చని న్యూస్‌వీక్ నివేదిక తెలిపింది.
NASA Discovers Super-Earth: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలను కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు భూమిని పోలిన అనేక గ్రహాలను కనుక్కున్నారు. తాజాగా మరోసారి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి భూమి లాంటి గ్రహాన్ని కనుక్కుంది. నాసా కనుక్కున్న సూపర్ ఎర్త్ భూమి పరిమాణం కన్నా 4 రెట్లు పెద్దగిగా ఉంది. తన నక్షత్రం చుట్టూ కేవలం 10.8 భూమి రోజుల్లోనే ఒక ఏడాదిని…
James Webb Telescope Captures Images Of Cartwheel Galaxy: జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వాంతరాల్లోని అద్భుతమైన ఫోటోలను భూమికి పంపిస్తోంది. మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గెలాక్సీ నిర్మాణాలను, నెబ్యులాలను క్యాప్చర్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పష్టతతో కూడిన అబ్బురపరిచే చిత్రాలను అందిస్తోంది. దీంతో విశ్వం తొలినాళ్లలో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాలు పుట్టుక, బ్లాక్ హోల్స్ గురించిన మరింత సమాచారాన్ని జెమ్స్ వెబ్ అందిస్తోంది
Russia-ISS: కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి రష్యా, అమెరికా. అయితే 2024 తరువాత తాము ఐఎస్ఎస్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ కల్పన, అభూత కల్పనతో సాగుతూనే సైన్స్ కూ పెద్ద పీట వేస్తూ చిత్రాలు రూపొందిస్తూ ఉంటాడు. తాజాగా నాసాలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించిన విశ్వంలోని అద్భుతమైన ఫోటోలను ఇలా విడుదల చేయగానే, అలా క్రిస్టఫర్ నోలాన్ ను హాలీవుడ్ జనాలు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, నోలాన్ తెరకెక్కించిన ‘ఇంటర్ స్టెల్లార్’లో కథ మొత్తం అంతరిక్షంలోని ఓ గ్రహం చుట్టూ తిరుగుతుంది. ఇది ఇలా ఉంటే క్రిస్టఫర్ సైతం…
అత్యంత ఖరీదు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ ఇంజనీరింగ్, సైన్స్ అద్భుతం జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించి అద్భుత చిత్రాలను పంపిస్తోంది. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు, నెబ్యులా, గ్రహాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తోంది. జెమ్స్ వెబ్ ను ప్రయోగించిన ఆరన్నర నెలల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. హబుల్ టెలిస్కోప్ కన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన జెమ్స్ వెబ్ విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించే క్రమంలో ఉంది. భూమికి 15…
ఆకాశంలో అద్బుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది మరోసారి చంద్రుడు భూమి దగ్గరగా రానున్నాడు. దీంతో సూపర్ మూన్ ఏర్పడబోతోంది. 2022లో మొత్తం నాలుగు సార్లు సూపర్ మూన్ కనువిందు చేయనున్నాయి. తాజాగా ఏర్పడుతున్న సూపర్ మూన్ మూడోది. తరువాతి సూపర్ మూన్ ఆగస్టు 12న కనిపించనుంది. పౌర్ణమి రోజు 90 శాతం చంద్రుడు కనిపించిన సందర్భంలో, భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయాల్లో ఈ సూపర్ మూన్…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ అద్భుత సమయం రానే వచ్చేసింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి అంతరిక్ష చిత్రం విడుదల అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షరాలు కమలా హ్యారిస్ ఈ ఫోటోను వైట్హౌస్లో ఆవిష్కరించారు. కనులవిందుగా ఉండే ఈ చిత్రంలో నక్షత్రాలు, భారీ గేలక్సీలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ సందర్భంగా.. మానవాళి ఇప్పటివరకూ చూడని సుదూరమైన ఇన్ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వెల్లడించారు.…
మానవుడి నాగరికత, టెక్నాలజీ భూమికి ప్రమాదాన్ని తీసుకువస్తోంది. తాజాగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కెనడాలోని వాటర్లు యూనివర్సిటీ శాస్త్రవేత్త క్వింగ్ బిన్ లూ వెల్లడించారు. ఈ రంధ్రం దిగువ స్ట్రాటో ఆవరణంలో ఏర్పడినట్లు గుర్తించారు. కొత్తగా కనుగొనబడిన ఈ ఓజోన్ హోల్ గత 30 ఏళ్లుగా…
కొద్దిరోజుల క్రితం చందమామను ఓ భారీ రాకెట్ ఢీకొట్టిందనీ, దాని వల్ల రెండు పగులు లోయలు ఏర్పడ్డాయని ప్రకటించిన అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా తాజాగా మరో విచారకర విషయం చెప్పింది. ఓ శాటిలైట్ కక్ష్య నుంచి జారిపోయి చందమామవైపు వెళ్తోందని చెప్పింది. అంతేకాదు. చందమామను ఢీకొడుతుందా లేదా అన్నది నాసా స్పష్టం చెయ్యలేదు. అయితే.. ఆ శాటిలైట్ మైక్రోవేవ్ ఓవెన్ సైజులో ఉంటుందని పేర్కొంది. తాజాగా..ఈ సాటిలైట్ ప్రయోగించగా, భూమి చుట్టూ తిరగాల్సి ఉంది.…